ఆగ‌స్ట్ మైండ్ బ్లాక్ గురూ!

Sunday, July 29th, 2018, 02:05:49 PM IST

ఈ ఆగ‌స్ట్ ఫుల్ బ్లాక్డ్‌! వ‌రుస‌గా భారీ ఈవెంట్ల‌తో దుమ్ము దుమారానికి తెర లేచింది. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `విశ్వ‌రూపం 2` ఆగ‌స్టు 9న రిలీజ‌వుతోంద‌ని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి, హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లో టీజ‌ర్‌, ట్రైల‌ర్ లాంచ్‌లు, ఆడియో ఈవెంట్ల‌కు క‌మ‌ల్ భారీగా ప్లాన్ చేశారు.

అదంతా అటుంచితే ఈ ఆగ‌స్ట్‌లో టాప్ ఈవెంట్స్‌కి తేదీలు లాక‌య్యాయి. చిరు, ర‌జ‌నీ, మ‌హేష్‌, ఎన్టీఆర్ వంటి స్టార్లు న‌టించిన సినిమాల‌ టీజ‌ర్ల రిలీజ్‌ల‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఆగ‌స్టు 9న మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌నున్నారు. దీంతో ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో కోలాహాలం మొద‌లైంది. అలానే ఆగ‌స్టు 15న ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ `అర‌వింద స‌మేత‌` తొలి టీజ‌ర్ లాంచ్ చేయ‌నున్నారు. నంద‌మూరి అభిమానులు ఇందుకోస‌మే వెయిటింగ్. ఇక‌పోతే
ఆగ‌స్టు 15న ర‌జ‌నీకాంత్ – శంక‌ర్‌ల క్రేజీ మూవీ 2.ఓ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే లీక్డ్ టీజ‌ర్‌నే మ‌తి చెడ‌గొట్టింది. ఒరిజిన‌ల్ టీజ‌ర్ వ‌స్తే యూట్యూబ్ ఠారెత్తిపోవ‌డం ఖాయం. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ర‌జనీ అభిమానులు ఆ క్ష‌ణం కోస‌మే వెయిటింగ్‌. ఇక పోతే మోస్ట్ ప్రెస్టేజియస్ సైరా- న‌ర‌సింహారెడ్డి టీజ‌ర్ ఎప్పుడొస్తుంది? అంటే ఆగ‌స్టు 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డేకి మెగా గిఫ్ట్ అందించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి ఆగ‌స్ట్ బ్లాక్ అయిపోయింది. ఉర‌క‌లెత్తే భారీ ఈవెంట్ల‌తో ద‌డ‌ద‌డ‌లాడ‌బోతోంది!! ద‌ట్సిట్‌!!

  •  
  •  
  •  
  •  

Comments