పాక్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకి పెద్ద ఎదురుదెబ్బ..!

Tuesday, June 11th, 2019, 02:13:34 PM IST

ఐసీసీ ప్రపంచకప్‌లో బలమైన జట్టుగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు మొన్నటి భారత్‌తో తలపడిన మ్యాచ్‌లో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ మీడియం పేస్ బౌలర్ మార్కస్ స్టొయినిస్ గాయపడ్డాడు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న స్టొయినిస్ అప్పుడప్పుడు బౌలింగ్‌లోనే కాకుండా అప్పుడప్పుడు తన బ్యాట్ ద్వారా కూడా మెరుపులు పుట్టిస్తుంటాడు.

అయితే ఆదివారం ఓవెల్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్ను భాగంలో తీవ్రమైన గాయం అయ్యింది. అయితే రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు స్టొయినిస్ దూరం కాబోతున్నాడు. అయితే అతని స్థానంలో మిషెల్ మార్ష్‌ను జట్టులోకి తీసుకోనుంది ఆస్ట్రేలియా. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకసారి ఎవరైనా ఆటగాడు టోర్నీ నుంచి తప్పుకుంటే తిరిగి అతనిని మళ్ళీ జట్టులోకి తీసుకునే అవకాశం ఉండదు. అందుకే రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు మరోసారి స్టొయినిస్ ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తారు. స్టొయినిస్ ఫిట్నెస్‌పై కాస్త అనుమానంగానే ఉన్న ఆస్ట్రేలియా ముందుగానే మిషెల్ మార్ష్‌ ను ఇంగ్లాండ్‌కి పిలిపించుకుంది. ఏది ఏమైనా స్టొయినిస్ మాత్రం ప్రపంచ కప్‌లో కొనసాగే అవకాశాలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి.