‘భారీ లక్ష్యం’ ముందు పెట్టినా ‘ఆస్ట్రేలియా’ లెక్కపెట్టలేదు

Tuesday, January 12th, 2016, 05:33:27 PM IST


ఈరోజు పెర్త్ లో ప్రారంభమైన ఆస్త్రేలియా – భారత్ వన్డే సిరీస్ తోలి మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. మరో వైపు సిరీస్ ను గెలుపుతో ఆరంభించిన ఆస్ట్రేలియా ఉత్సాహంగా ఉంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 5ఓ ఓవర్లు ముగిసే సరికి 309 పరుగులు చేసి 310 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్త్రేలియా ముందుంచింది. భారత బ్యాట్స్ మెన్ లలో రోహిత్ శర్మ 163 బంతుల్లో 171 పరుగులు, కోహ్లీ 97 బంతుల్లో 91 పరుగులు, ధోనీ 13 బంతుల్లో 18 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్క్నర్ 2, హజెల్ వుడ్ 1 వికెట్ తీసుకున్నారు.

భారీ లక్ష్య ఛేధనకు దిగిన ఆస్ట్రేలియా తోలుత తడబడి ఫించ్, వార్నర్ వికెట్లను కోల్పోయినప్పటికీ తరువాత గ్రీజ్లోకి వచ్చిన స్మిత్ 135 బంతుల్లో 139 పరుగులు, బెయిలీ 120 బంతుల్లో 112 పరుగులు చేసి జట్టు లక్ష్యాన్ని ఖాయం చేశారు. భారత్ బౌలర్లలో కొత్త బౌలర్ బరిందర్ శరన్ 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు.