ఆస్ట్రేలియా టూర్ లో భారత్ ఆటగాళ్లకు అవమానం.!

Friday, December 28th, 2018, 05:01:26 PM IST

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం వేదికగా అక్కడ మన భారత జట్టుకి మరియు ఆస్ట్రేలియా జట్టుకి టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఇరు జట్ల మధ్య ఏ స్థాయిలో మాటల యుద్ధాలు,స్లెడ్జింగ్ లు ఉంటాయో కూడా తెలిసిందే,అదే విధంగా అక్కడ క్రికెట్ ఆటను వీక్షించడానికి వచ్చే అభిమానులు కూడా ఎంత నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తారో కూడా తెలుసు.ఇప్పుడు కూడా అదే విధంగా అక్కడ మ్యాచును వీక్షించేందుకు వచ్చినటువంటి ఆస్ట్రేలియా అభిమానులు మరో సారి మన జట్టు ఆటగాళ్ల మీద కావాలనే జాతి వివక్షత చూపుతూ మాట్లాడ్డం,కింది వరుసలో కూర్చున్నటువంటి వారు ఫీల్డింగ్ సమయంలో భారత ఆటగాళ్ళని వారి మాటలతో ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారట.అంతే కాకుండా మరికొంత మంది భారత ఆటగాళ్లకు ఇంకా కోపం తెప్పించే విధంగా మీ వీసా చూపించండి అంటూ అరవడం వంటివి చేశారని తెలుస్తుంది.అయితే ఈ విషయం ఎలాగో తెలుసుకున్నటువంటి అక్కడి పోలీసులు వారికి వార్నింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి చర్యలు చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని అక్కడ వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆస్ట్రేలియా అభిమానుల అత్యుత్సాహానికి బ్రేకులు వేశారు.