ఉదయాన్నే ఆటలో 2 లక్షలు.. డ్రైవర్ షాక్!

Thursday, January 11th, 2018, 12:22:32 AM IST

ప్రస్తుత రోజుల్లో మనిషి డబ్బు కోసం ఎంత దారుణానికి అయినా సిద్ధపడతాడు అని కొన్ని ఉదాహరణలు చాలానే నిరూపిస్తున్నాయి. అంతే కాకుండా కొంచెం ఎక్కువ డబ్బుతో బయటకు వెళితే చాలు భయంగా ఉంటుంది. ఎప్పుడు ఎవడు కొట్టేస్తాడో తెలియదు. ఇలాంటీ రోజుల్లో రూపాయి దొరికినా కూడా కనిపించిన ధనలక్ష్మిని వదులుకోకూడదని జేబులో వేసుకుంటారు. కానీ ఇటీవల ఒక మహిళ 2 లక్షల రూపాయలు ఉన్న బ్యాగును పొరపాటున మరచిపోయింది. అయితే అది తెలుసుకున్న వ్యక్తి నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. బెంగుళూర్ కు చెందిన దివ్య ఒక ఆటోలో డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆటోలో వెళ్లింది. కానీ ఆమె పొరపాటున మరచిపోయి 2 లక్షలు ఉన్న చిన్న బ్యాగ్ ను ఆటోలో వదిలేసింది. అయితే తెల్లవారుజామున ఆటో లో బ్యాగ్ ను చూసిన డ్రైవర్ సుహేల్‌బాషా డబ్బును చూసి మొదట షాక్ అయ్యాడు. ఆ తరువాత ఎవరిదో అయ్యి ఉంటుందని నేరుగా సమీపాన ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. దీంతో ముందే తన డబ్బు పోయిందని పోలీసులను ఆశ్రయించిన దివ్యకు పోలీసులు సమాచారం అందించగా..ఆమె డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపింది. అంతే కాకుండా పోలీసులు కూడా ఆటో డ్రైవర్ సుహేల్‌బాషా ని ప్రశంసించారు.