అవతార్ సీక్వెల్స్ కోసం… అన్ని వేల కోట్ల!

Wednesday, September 27th, 2017, 05:19:25 PM IST


జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సినిమా హాలీవుడ్ లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మించబడిన ఆ సినిమా అదే స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇప్పటికి అవతార్ సినిమా చూస్తే ఏదో ఒక వింత ప్రపంచంలో ఉన్నామనే భ్రమ కలుగుతుంది. అంత అద్బుతంగా ఆ సినిమాని దర్శకుడు తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ అవతార్ సినిమాకి నాలుగు సీక్వెల్స్ ని దర్శకుడు కామెరూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికి అవతార్ 2 కి సంబంధించి షూటింగ్ కూడా పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్స్, సీజీ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నాలుగు భాగాలకి చేస్తున్న ఖర్చు తెలిస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే హాలీవుడ్ లో ఇది వరకు ఎ సినిమా సీరీస్ కి అంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఈ నాలుగు సీక్వెల్స్ కి మొత్తం 6,540 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే అవతార్ 2, అవతార్ 3 రిలీజ్ డేట్స్ ని కూడా ప్రకటించారు. రెండో భాగం 2020, డిసెంబర్ 18న రిలీజ్ చేస్తే, 2021 డిసెంబర్ మూడో భాగం రిలీజ్ చేస్తారని ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించినట్లు తెలుస్తుంది. మరి మొదటి భాగమే అంత గొప్పగా ఉన్నప్పుడు మిగిలిన మూడు భాగాలని ఇంకా ఎ రేంజ్ లో కామెరూన్ తెరకెక్కించాడో చూడాలంటే మరో రెండేళ్ళు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments