15000 కోట్ల‌తో `అవ‌తార్‌` రికార్డులు బ్రేక్

Saturday, April 28th, 2018, 04:44:07 PM IST

`అవ‌తార్` రికార్డుల‌కు బిగ్ బ్రేక్‌…. స్టార్ వార్స్‌.. బ్లాక్ పాంథ‌ర్‌.. టైటానిక్ రికార్డుల‌కే ఎస‌రు పెట్టిన స‌న్నివేశ‌మిది. ఇన్నేళ్ల‌లో ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని రీతిలో హ‌వాని సాగిస్తున్న ది గ్రేట్ `అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌` సంచ‌లనాల గురించే ఇంటా బ‌య‌టా టాక్ న‌డుస్తోంది. ఇటీవ‌లే రిలీజైన‌ `అవెంజ‌ర్స్ : ఇన్‌ఫినిటీ వార్‌` వ‌సూళ్ల హ‌వా ముందు పాత రికార్డుల‌న్నీ వెన‌క్కి వెళ్లిపోయాయ్‌. ఈ సినిమా అమెరికాలో అసాధార‌ణ వ‌సూళ్లు సాధించింది. రిలీజైన కేవ‌లం మూడే మూడు రోజుల్లో ఏకంగా 15000 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు తిర‌గ‌రాసింది. ఇంత‌వ‌ర‌కూ `స్టార్ వార్స్‌- ది ఫోర్సెస్ అవేకెన్స్‌` మాత్ర‌మే ఆ స్థాయి వ‌సూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ సినిమా త‌ర‌వాతి స్థానం `అవెంజ‌ర్స్ 2` అందుకుంది.

అమెరికాలో దాదాపు 248 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ఓపెనింగ్‌ వీకెండ్ రికార్డుల్లో నంబ‌ర్ వ‌న్ స్థానం `స్టార్ వార్స్ -ది ఫోర్సెస్ అవేకెన్స్‌` ద‌క్కించుకుంది. ఆ నెక్ట్స్ పొజిష‌న్స్‌లో స్టార్ వార్స్ – ది లాస్ట్ జేడీ, బ్లాక్ పాంథ‌ర్‌, అవ‌తార్ చిత్రాలు రికార్డుల్లో ఉన్నాయి. ఇటీవ‌లి కాలంలో స్టార్ వార్స్ త‌ర‌వాత గ్రేట్ మూవీగా `బ్లాక్ పాంథ‌ర్‌` చిత్రం రికార్డుల‌కెక్కింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేస్తూ.. తొలి వీకెండ్ అమెరికాలో 235 మిలియ‌న్ డాల‌ర్లతో `అవెంజ‌ర్స్ 2` చ‌రిత్ర సృష్టించింది. దాదాపు 15,065 కోట్ల వ‌సూళ్ల‌కు ఈ మొత్తం స‌మానం. `స్టార్ వార్స్ – ది ఫోర్స్ అవేకెన్స్‌` ఫుల్ ర‌న్‌లోనూ నంబ‌ర్ సినిమాగా రికార్డుల‌కెక్కింది. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 937 మిలియ‌న్ డాల‌ర్లతో టాప్‌లో ఉంది. అలానే `అవ‌తార్‌` 760 మిలియ‌న్ డాల‌ర్ల తో టాప్ 2 స్థానంలో ఉంది. రీసెంట్ సెన్సేష‌న్‌ బ్లాక్ పాంథ‌ర్ 681 మిలియ‌న్ డాల‌ర్ల తో ఫుల్ ర‌న్‌లో టాప్ 3 సినిమాగా సంచ‌ల‌నం సృష్టించింది. `అవెంజ‌ర్స్- 2` ఈ రికార్డుల్ని బ్రేక్ చేసి ఉత్త‌మ స్థానం అందుకుంటుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments