దాదాపు రూ.12,000 కోట్ల కలెక్షన్లతో అవెంజర్స్ సంచలనం!

Thursday, May 17th, 2018, 06:35:48 PM IST

దాదాపు రూ.12,000 కోట్ల కలెక్షన్లతో ఓ చిత్రం సంచలనం సృష్టించే దిశగా దూసుకుపోతోంది.. అంత పెద్ద మొత్తాన్ని ఆ సినిమా కేవ‌లం మూడు వారాల్లో వ‌సూలు చేసింది. ఇంత‌కీ ఏ సినిమా? అంటే.. అదే అవెంజ‌ర్స్‌- ఇన్‌ఫినిటీవార్‌.. చెక్ డీటెయిల్స్‌.. `అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్‌` (అవెంజ‌ర్స్ 2) సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఈ చిత్రం దాదాపు రూ.12,000 కోట్ల (1.72 బిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూళ్ల‌తో `జురాసిక్ వ‌ర‌ల్డ్‌` రికార్డుల్సి బ్రేక్ చేసింది. వ‌ర‌ల్డ్ టాప్‌-4 సినిమాగా స‌రికొత్త రికార్డును అందుకుంది. అవ‌తార్ -2.8 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నంబ‌ర్ -1 స్థానంలో నిల‌వ‌గా, టైటానిక్ -2.2 బిలియ‌న్ డాల‌ర్ల‌తో రెండో స్థానం ద‌క్కించుకుంది. స్టార్ వార్స్ : ఫోర్సెస్ అవేకెన్స్‌- 2.1 బిలియ‌న్ డాల‌ర్ల‌తో మూడో స్థానంలో ఉంది. ఆ త‌ర‌వాత నాలుగో స్థానంలో జురాసిక్ వ‌ర‌ల్డ్ -1.67 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును అధిగ‌మించి `అవెంజ‌ర్స్ 2` ఏకంగా 1.72 బిలియ‌న్ డాల‌ర్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించింది. `జురాసిక్ వ‌ర‌ల్డ్‌`ని ఐదో స్థానానికి ప‌రిమితం చేసింది. ఇప్పుడే ఇంతమొత్తం కలెక్షన్ రాబట్టిన ఈ చిత్రం రానున్న రోజుల్లో ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచిచూడాలి మరి….