పెరుగుతున్న అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ కలెక్షన్స్!

Sunday, May 6th, 2018, 12:07:13 PM IST

మర్వెల్ సంస్థ ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. ఇండియాలో ఏ సినిమాకు దక్కని ఆదరణను చాలా వేగవంతంగా అందుకుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 100 కోట్లను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా అందిన బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం సినిమా రెండవ వారంలో మరిన్ని కలెక్షన్స్ ని రాబట్టిందని తెలుస్తోంది.

మొత్తంగా రెండవ వారం కూడా పాజిటివ్ టాక్ తో 164 కోట్ల వరకు కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా అవెంజర్స్ కలెక్షన్స్ లో తేడా రావడం లేదు. మరికొన్ని రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల బాక్స్ ఆఫీస్ మార్క్ ను ఎన్ని రోజుల వ్య్వవధిలో అందుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ మార్క్ ను అందుకుంటుందో లేదో చూడాలి.