అత్యధిక థియేటర్స్ లో హాలీవుడ్ మూవీ..

Monday, April 23rd, 2018, 04:08:42 PM IST

హాలీవుడ్ సూపర్ హీరోలందరు ఒకే తెరపై కనిపిస్తే ఆ కిక్కు ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అవెంజర్స్ సిరీస్ లకు ఉండే ఆదరణ చాలా ప్రత్యేకం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరు అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ చిత్రం కోసం చాలానే ఎదురుచూస్తున్నారు. అలాగే ఇండియాలో కూడా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ తమిళ్ కూడా సినిమా విడుదల కానుంది.

విలన్ థానోస్‌ను ఎదుర్కోవడమే సినిమాలో హీరోలు చేసే పని. విలన్ పాత్రకు రానా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇకపోతే ఏ ఇంగ్లీష్ సినిమా రిలీజ్ కానీ విధంగా అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్ ఇక్కడ విడుదల కానుంది. దాదాపు 2000 థియేటర్స్ లలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రీ బుకింగ్స్ లలో చిత్ర సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తోంది. ఇండియాలో అన్ని ప్రాంతాల్లో మొదటి రోజు టికెట్స్ దొరకడం కష్టమే అన్నట్లు ఉంది. మర్వెల్ సంస్థ 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ సినిమాను నిర్మించగా ఆంటోనీ రూస్సో, జో రూస్సోలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

  •  
  •  
  •  
  •  

Comments