బాలీవుడ్ లో కోలుకోలేని దెబ్బే ఇది..!

Monday, May 7th, 2018, 12:04:51 PM IST

బాలీవుడ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది. నేషనల్ లెవెల్లో విడుదలయ్యే సినిమాలు కాబట్టి అందరు ఆకర్షితులవుతారు. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాలీవుడ్ సినిమాలు ఈజీగా 100 కోట్లను దాటేస్తుండడం గత ఐదేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఏడాది మాత్రం అనుకున్నంత రేంజ్ లో ఏ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోలేదు. దాదాపు సగం ఏడాది పూర్తి కావొస్తోంది. రీసెంట్ గా కొన్ని భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఏవి ఎంతగా ఆకట్టుకోలేదు.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను శాసిస్తున్న బాలీవుడ్ కి ఈ సారి హాలీవుడ్ సినిమా గట్టి సమాధానమే ఇచ్చింది. అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఈ ఏడాది ఏ సినిమా రాబట్టని ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 6న రిలీజ్ అయిన ఇర్ఫాన్ ఖాన్ – బ్లాక్ మెయిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 18 కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జుడ్వా 2 సినిమాతో గత ఏడాది 200 కోట్ల బిజినెస్ చేసిన వరుణ్ ధావన్ ఈ ఏడాది ఫెయిల్ అయ్యాడు. ఏప్రిల్ 20న వచ్చిన అక్టోబర్ సినిమా అంచనాలను తారుమారు చేయడంతో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. కేవలం 42 కోట్ల మార్క్ ను అందుకోవడం గమనార్హం.

ఆ తరువాత వచ్చిన ప్రభుదేవ – మెర్క్యురీ (ఏప్రిల్ 20) అభయ్ డియోల్- నాను కి జాను (ఏప్రిల్ 20) మరియు రాహుల్ భట్.. రిచా చద్దా.. అదితి రావు హైదారి యొక్క దాస్ డేవ్ (ఏప్రిల్ 27) సినిమాలు కోటి రూపాయల ఓపెనింగ్స్ కూడా అందుకోలేదు. అవేంజర్స్: ఇన్ఫినిటీ మాత్రం 30.50 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని టాప్ లో నిలిచింది. ఇక ఈ శనివారం వరకు అందిన లెక్కల ప్రకారం 174.50 కోట్ల వరకు కలెక్షన్స్ అందినట్లు టాక్.

గతంలో వచ్చిన జంగల్ బుక్ 188 కోట్లను అందుకొని ఇండియాలో అత్యదిక వసూళ్లు అందుకున్న హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు అవేంజర్స్:ఇన్ఫినిటీ వార్ దాన్ని మించేలా ఉంది. మరో 25 కోట్లు లాగేస్తే 200 క్లబ్ లో చేరుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments