6600 కోట్లతో త‌డాఖా చూపించిన `అవెంజర్స్‌-2`

Saturday, May 5th, 2018, 09:42:07 PM IST


`అవెంజ‌ర్స్ 2` ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికి దాదాపు 6600 కోట్లు (1బిలియ‌న్ డాల‌ర్స్‌) వ‌సూళ్లు సాధించింద‌ని ప్ర‌ఖ్యాత గార్డియ‌న్ వెల్ల‌డించింది. అంతేకాదు ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అన్ని రికార్డుల్ని తిర‌గ‌రాసింది. స్టార్‌వార్స్ – ది ఫోర్స్ అవేకెన్స్ చిత్రం 12 రోజుల్లో సాధించిన వ‌సూళ్ల‌ను కేవ‌లం 11 రోజుల్లోనే సాధించి అవెంజ‌ర్స్ త‌డాఖా చూపంచింది. ఇక స్టార్ వార్స్ సిరీస్‌తో పాటు, ఇత‌ర‌త్రా టైటానిక్, అవ‌తార్ వంటి సినిమాల రికార్డుల్ని వెన‌క్కి నెట్టేసింది. ఇటీవ‌లే రిలీజైన బ్లాక్ పాంథ‌ర్ ని సైతం రికార్డుల్లో బ్యాక్ బెంచీకి ప‌రిమితం చేసింది.

ఇక మీద‌ట స్టార్ వార్స్ – ది ఫోర్స్ అవేకెన్స్ ఫుల్ ర‌న్ రికార్డుల్ని కొట్టేయాల్సి ఉంటుంది. అయితే ఫుల్ ర‌న్‌లో ఆ వ‌సూళ్ల రికార్డును అందుకోవాలంటే అవెంజర్స్ 2 మ‌రో నాలుగైదు వారాలు అయినా ఇలానే చ‌క్క‌ని వ‌సూళ్లు ద‌క్కించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా ఇండియా నుంచి దాదాపు 150 కోట్లు వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది.