ఇండియాలో టాప్ 1లో నిలిచిన అవెంజర్స్‌ : ఇన్ఫినిటీవార్‌

Saturday, April 28th, 2018, 05:25:11 PM IST

శుక్రవారం విడుదలైన హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌ ఇండియాలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇంతవరకు భారత్ లో ఏ హాలీవుడ్ సినిమా రాబట్టని కలెక్షన్స్ ను ఈ సినిమా అందుకుంది. అందుకు సంబందించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా ఈ ఏడాది అవెంజర్స్ ముందు చిన్నబోయింది. ఎందుకంటే 2018 లో విడుదలైన ఏ బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోలేదు. విడుదలైన మొదటి రోజే సినిమా 31.30 కోట్లను వసూలు చేసి అందరిని షాక్ కి గురి చేసింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో టాప్ 5 సినిమాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నట్లు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ వివరించారు.

1. అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌-రూ.31.30 కోట్లు. (ఇంగ్లీషు + డబ్బింగ్‌ వెర్షన్స్‌)
2. బాఘి 2 -రూ.25.10 కోట్లు.
3. పద్మావత్ – రూ.19 కోట్లు.
4. ప్యాడ్‌మ్యాన్‌ -రూ.10.26 కోట్లు.
5. రెయిడ్‌ -రూ.10.04 కోట్లు రాబట్టాయి.

  •  
  •  
  •  
  •  

Comments