పెద్ద హీరోతో చిన్నారి పెళ్లికూతురి ప్రేమాయణం !!

Wednesday, September 28th, 2016, 08:25:45 PM IST

avika-goar
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ తెలుగులో ”ఉయ్యాలా జంపాల” తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రెండు, మూడు సినిమాలు చేసిన ఈ భామకు ఇక్కడ బాగా లేదని బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఓ సీరియల్ చేస్తుంది. ఇక ఈ మధ్య తెలుగులో కూడా సినిమాలను ఒప్పుకోవడం లేదు, అయితే అవికాగోర్ పై ఈ మధ్య ఓ న్యూస్ బాగా చక్కర్లు కొడుతోంది. అందేంటో తెలుసా .. ఈ భామ తనకన్నా చాలా పెద్దవాడైన ఓ హీరోతో ఘాటు ప్రేమాయణం సాగిస్తుందట !! నిజానికి వీరిద్దరూ ఫ్రెండ్స్ లా బాగా పరిచయం పెంచుకుని ఇప్పుడు దాన్ని ప్రేమగా మార్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇద్దరు కూడా జోరుగా షికార్లు, పార్టీ లు, పబ్ లంటూ హంగామా చేస్తున్నారట !! వీరి వ్యవహారం పై ఇప్పటికే రకరకాల పుకార్లు జోరందుకున్నాయి. ఈ విషయం పై ఈ అమ్మడు మాత్రం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెడుబుతుందట. అవికా వ్యవహారం చాలా తేడాగా ఉందని అంటున్నారు సినీజనాలు.

Comments