రీ ఎంట్రీ ఇస్తున్న చిన్నారి పెళ్లి కూతురు?

Wednesday, May 9th, 2018, 11:28:27 AM IST

చిన్నారి పెళ్లి కూతురు టివి సీరియల్ తో బాగా పాపులర్ అయినా అవికా గోర్ .. ఆ తరువాత తెలుగులోకి ఉయ్యాలా జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ అందుకున్న ఈ అమ్మడు అటుపై అరడజనుదాకా సినిమాలు చేసింది. అయితే చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలపాలు అవ్వడమతొ పాపం ఈ పాపకు అవకాశాలు తగ్గాయి .. దాంతో టాలీవుడ్ కి బాయ్ బాయ్ చెప్పేసి .. బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు ప్రయత్నాలు మొదలు పెట్టింది .. అక్కడ ఈ అమ్మడి పప్పులు పెద్దగా ఉడకలేదు .. ఇక్కడ ఉంటె ఉన్న క్రేజ్ కూడా పోతుందని అనుకుందో ఏమో .. మళ్ళీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం వారాహి చలనచిత్ర బ్యానర్ లో తెరకెక్కే ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాలో ఈ భామను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ మధ్య టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో తనను వేధిస్తున్నాడంటూ నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ హీరోతో చేస్తున్న సినిమాను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది అవికా. కొంత గ్యాప్ తరువాత అవికా రీ ఎంట్రీ ఇలా ఉంటుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments