షాక్ … అవికాగోర్ ని ఆ హీరో వేధిస్తున్నాడట ?

Wednesday, November 23rd, 2016, 11:36:29 AM IST

avika-gor
చిన్నారి పెళ్లి కూతురిగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ .. ”ఉయ్యాలా జంపాల” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాత తెలుగులో పలు చిత్రాలు చేసిన ఈ భామ కొంత గ్యాప్ తరువాత లేటెస్ట్ గా ”ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాలో కనిపించింది. ఈ సినిమాకోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ భామకు ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఎదురైందట!! టాలీవుడ్ కి చెందిన ఓ హీరో తనను వేధిస్తున్నాడని చెబుతుంది? వాట్స్ అప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తూ .. మరి టార్చర్ పెడుతున్నాడని, మొదట్లో పెద్దగా పట్టించుకోని ఈ అమ్మడు .. అతని నుండి వస్తున్న ఈ మెసెజ్ లు ఎక్కువవడంతో .. ఈ మెసేజ్ లు పెట్టేది ఎవరా ? అని ఆరాతీసిందట .. దాంతో తనకు షాక్ ఇచ్చే విషయం తెలిసింది .. తనకు బాగా తెలిసిన హీరోనే ఇలాంటి మెసేజ్ లు పంపిస్తున్నాడని తెలుసుకుని షాక్ అయిందట !! ఈ విషయం పై తన వారితో చెప్పుకుని బాధపడిందట, అతగాడి వల్ల తెలుగులో సినిమాలు చేయాలంటేనే .. విరక్తి కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుందట!! అయితే తనను వేధిస్తున్న హీరో ఎవరో మాత్రం చెప్పలేదు ?