ఆశ్చర్యపరచే సుమంత్ అశ్విన్ ప్రీ లుక్ పోస్టర్

Friday, March 30th, 2018, 11:22:38 AM IST


సుమంత్ అశ్విన్ ఎన్నో ఫ్లాపులను ఎదుర్కొని చారా రోజులుగా చిత్ర సీమకి దూరమిన్ మళ్ళీ ఇటీవ‌ల మ‌ళ్ళీ రావా చిత్రంతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చిన సుమంత్ ప్ర‌స్తుతం త‌న 24వ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ఇదం జ‌గ‌త్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తుండ‌గా, తాజాగా ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఒక షేడ్‌తో సుమంత్ లుక్ రివీల్ చేశారు. సినిమా టైటిల్‌ని ఏప్రిల్ 1న పబ్లిక్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు దగ్గరలో ఉంది. మ‌ల‌యాళం హీరోయిన్ అంజు కురియ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్ట‌ర్ అనీల్ శ్రీకాంతం ద‌ర్శ‌క‌త్వం చేయగా, శ్రీచ‌ర‌ణ్ ప‌కాలా సంగీతం అందిస్తున్నాడు. త్వ‌ర‌లోనే మూవీ విడుద‌ల‌ చేయడానికి సర్వత్రా సిద్దం చేయనున్నారు. ఇదిలా ఉంటే సుమంత్ 25వ చిత్రంగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం అనే చిత్రం రూపొందుతుంది. ఉగాది రోజు ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈషా కథానాయికగా నటిస్తున్నది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ జోనర్‌లో సుమంత్‌ సినిమా చేయడం ఇదే తొలిసారి. ఇక చూడాలి రాబోవు ఈ రెండు సినిమాలు సుమంత్ అశ్విన్ కి ఎంత హిట్టు తెచ్చిపెడతాయో అన్న విషయం.