రాజశేఖర్ తో ‘అ’ డైరెక్టర్

Thursday, April 26th, 2018, 12:56:12 PM IST

నాని తొలిసారి నిర్మించిన అ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌స్తుతం త‌న రెండో సినిమా స్క్రిప్ట్ ప‌నులు కూడా పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. అ అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో అంద‌రిని అల‌రించాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌తో సినిమాని అద్భుతంగా న‌డిపించాడు ఈ యంగ్ డైరెక్ట‌ర్ . అయితే ఇటీవ‌ల యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్‌ని క‌లిసి స్టోరీ వినిపించాడ‌ట ప్ర‌శాంత్ . క‌థ రాజ‌శేఖ‌ర్‌కి చాలా న‌చ్చ‌డంతో వెంటనే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జూలై నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. చిత్రానికి క‌ల్కి అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల గ‌రుడవేగ చిత్రంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్టు కొట్టిన రాజ‌శేఖర్ త్వ‌ర‌లో మరిన్ని మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments