రివ్యూ రాజా తీన్‌మార్ : ‘అ !’ – అర్థమైతే చాలు !

Friday, February 16th, 2018, 10:25:52 PM IST


తెరపై కనిపించిన వారు: కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని

కెప్టెన్ ఆఫ్ ‘అ !’: ప్రశాంత్ వర్మ

మూల కథ :

రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు రాధ ( ఈషా రెబ్బ ), క్రిష్ (నిత్యా మీనన్), శివ (శ్రీనివాస్ అవసరాల), మీర (రెజినా), నలభీమ (ప్రియదర్శి) అందరూ ఎవరి వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు బిజీగా, సతమవుతూ ఉంటారు.

వాళ్ళ మధ్యలో కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ, విముక్తి కోసం మాస్ మర్డర్స్ చేయాలనుకుంటుంది. అసలు రాధ, క్రిష్, నలభీమ.. వీళ్లంతా ఎవరు, ఒకరికొకరికి మధ్యన సంబంధం ఏంటి, కాలి ఎవర్ని చంపాలనుకుంది, చివరికి వీళ్లందరి కథ ఏమైంది అనేదే సినిమా.

విజిల్ పోడు :

–> కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, మురళీ శర్మ, రెజినాలు తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అసలు వీరంతా కలిసి ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమా కోసం ముందుకురావడం అభినందించదగిన విషయం. కాబట్టి రెండో విజిల్ వాళ్ళకే వేయాలి.

–> ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక చిన్న పాయింట్ ను తీసుకుని దానికి మంచి కథనాన్ని, ఆసక్తికరమైన పాత్రల్ని జోడించి మంచి ఇంటర్వెల్ ఇవ్వడం బాగుంది. కాబట్టి మూడో విజిల్ ఆయనకే వేయాలి.

–> సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా మొత్తాన్ని ఒక రెస్టారెంట్లో చిత్రీకరించడం బాగుంది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> సెకండాఫ్ కథనం కొద్దిగా కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది.

–> శ్రీనివాస్ అవసరాల పాత్రలో పెద్దగా పట్టు కనిపించదు. అతనిపై నడిచే కొన్ని సీన్స్ కూడా బోరింగా అనిపిస్తాయి.

–> సినిమా క్లైమాక్స్ కూడ ఏదో అనుకుంటే ఇంకేదో వచ్చి కన్ఫ్యూజ్ ను కొంత పెంచేస్తుంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> సినిమా ద్వితీయార్థంలో కొన్ని సీన్స్ అర్థం కాకుండా విచిత్రంగా అనిపిస్తాయి.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : నాకెందుకో మంచి ప్రయత్నంలా అనిపించింది.
మిస్టర్ ఏ : అవును. మంచి ప్రయత్నమే..కానీ అర్థమయ్యేలా చేసుంటే బాగుండేది.
మిస్టర్ బి : అదీ కరెక్టే. ప్రయత్నమేదైనా చూసే వాళ్ళకి అర్థమైతే చాలు.

  •  
  •  
  •  
  •  

Comments