బిగ్ అప్డేట్ : నా కూతురిని ఎవరు చంపారో రోజా కి తెలుసు – అయేషా తల్లి సంచలన వాఖ్యలు

Saturday, December 14th, 2019, 10:42:53 AM IST

గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ అయేషామీరా కేసు మరొకసారి సంచలనంగా మారింది. కాగా దాదాపు 12 సంవత్సరాల తరువాత అయేషా మీరా మృతదేహానికి మళ్ళీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయేషామీరా తల్లి శంషాద్ బేగం, అధికార వైసీపీ పార్టీ నగరి నియోజక వర్గ ఎమ్మెల్యే రోజా పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే అయితే విజయవాడలో అయేషామీరా హత్య జరిగిన సమయంలో హడావుడి చేసిన నగరి ఎమ్మెల్యే రోజా, ఈ ఘటన విషయంలో ఎందుకు స్పందించడం లేదని శంషాద్ బేగం ఆరోపిస్తున్నారు.

అయితే తన కూతురు హత్య కి కారణమైన ఆ నిందితులు ఎవరో రోజా కి తెలిసినప్పటికీ కూడా కొన్ని రాజకీయాల కారణంగా ఎమ్మెల్యే రోజా నోరు మెదపడం లేదని అయేషా తల్లి ఆరోపిస్తున్నారు. ఇకపోతే ఏపీలో తాజాగా ప్రవేశపెట్టిన దిశ చట్టం ప్రకారం కేవలం 21 రోజుల్లో నిందితులను పట్టుకొని చట్టపరమైన శిక్ష విధిస్తామని ప్రకటించిన సీఎం జగన్, తన కూతురు అయేషా కేసును కూడా పరిగణలోకి తీసుకోవాలని తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.