వీడియో : రియ‌ల్ లైఫ్ క‌పుల్ రీల్ లైఫ్‌లో ఇలా!?

Friday, March 9th, 2018, 08:35:46 PM IST

టైగ‌ర్ ష్రాఫ్ – దిశాప‌టానీ జోడీ ప్రేమాయ‌ణం గురించి విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు. నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్న వేళ సీక్రెట్‌గా విదేశీ ట్రిప్ వెళ్లిన ఈ జంట‌పై చాలానే పుకార్లు షికారు చేశాయి. విదేశీ బీచ్‌ల‌లో ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు, అక్క‌డే పెళ్లి కూడా చేసేసుకున్నార‌ని బాలీవుడ్ మీడియా ప్ర‌చారం సాగించింది. అయితే ఈ పెళ్లి ఇంట్లో వాళ్ల‌కు ఏమాత్రం ఇష్టం లేద‌ని కొత్త కొత్త క‌థ‌లు ప్ర‌చారం చేసింది. దీనిని ఖండించ‌నూ లేదు. ధృవీక‌రించ‌నూ లేదు. దీంతో అదంతా నిజ‌మేనంటూ మ‌రో కొత్త క‌థ‌నంతో మీడియా అదే ప‌నిగా భ‌జ‌న చేసింది.

త్వ‌ర‌లో ఈ ల‌వ్ క‌పుల్ న‌టించిన `భాఘి 2` రిలీజ‌వుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఏ విజువ‌ల్ ఆన్లైన్‌లోకి వ‌చ్చినా వెంట‌నే వైర‌ల్ అయిపోతోంది. ఆ స్థాయిలో టైగ‌ర్ – దిశా మ‌ధ్య రొమాన్స్ మెస్మ‌రైజ్ చేస్తోంది. రియ‌ల్ లైప్ క‌పుల్ అయితేనే ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డం సాధ్య‌మ‌వుతుంది అన్న సంగ‌తిని ఈ వీడియోలు ఎలివేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ జంట ఆడిపాడిన రొమాంటిక్ సాంగ్ ఒక‌టి యూట్యూబ్‌లో రిలీజైంది. పాట‌లో యువజోడీ పెర్ఫామెన్స్ మ‌తి చెడ‌గొడుతోందంటే అతిశ‌యోక్తి కాదు. ప్రేయ‌సి కోసం ప్రియుడు ప‌డే పాట్లు అంతే ముచ్చ‌ట క‌లిగిస్తున్నాయంటే న‌మ్మండి. డార్లింగ్ దిశాని ప్రియుడు ష్రాఫ్ ప్ర‌స‌న్నం చేసుకునే పనులు చేయ‌డం చూస్తే, ఆహా ఇంత‌కంటే రొమాంటిక్ పెయిర్ ఉంటుందా? అనిపించ‌క మాన‌దు. ఈ స‌మ్మ‌ర్‌ని వేడెక్కించేందుకు ఈ భారీ ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్‌కొస్తోంది. టిల్ దెన్ వెయిట్..