బాహుబ‌లి-2 పోస్ట‌ర్‌: 1000 కోట్ల‌కు విల్లు గురిపెట్టారిలా!!

Thursday, January 26th, 2017, 12:59:07 PM IST

baahubali-2
600 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌లనం సృష్టించింది `బాహుబ‌లి`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అసాధార‌ణ ప్ర‌తిభా పాఠ‌వం ఏంటో ప్ర‌పంచానికి ఈ సినిమా చూశాక తెలిసొచ్చింది. విజువ‌ల్ గ్రాఫిక్స్‌ని ఈ రేంజులో వాడుకోవ‌డం ఎలానో బాలీవుడ్‌కి సైతం నేర్పించాడు మ‌న జ‌క్క‌న్న‌. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించాడు. తెలుగు సినిమా ఖ్యాతి న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న చందంగా వెలిగిపోయింది బాహుబ‌లి వ‌ల్ల‌నే.

ఇప్పుడు బాహుబ‌లి -2 రిలీజ్‌కి వ‌స్తోంది. ఇంకో మూడు నెల‌లే స‌మ‌యం మిగిలి ఉంది. ఏప్రిల్ 28 నాటికి అన్నిప‌నులు పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. నేడు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా బాహుబ‌లి: ది క‌న్‌క్లూజ‌న్ కొత్త పోస్ట‌ర్ల‌ను లాంచ్ చేశారు జ‌క్క‌న్న‌. ఒక‌టి మాహిష్మ‌తి ఏరియ‌ల్ వ్యూ, రెండోది బాహుబ‌లి- దేవ‌సేన జంట విల్లంబులు చేప‌ట్టి సాగిస్తున్న విన్యాసాల్ని పోస్ట‌ర్‌లో ఆవిష్క‌రించారు. ఈ పోస్ట‌ర్ చూడ‌గానే జ‌క్క‌న్న రూ.1000 కోట్ల వ‌సూళ్ల‌కు గురిపెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. ఆర్కామీడియా సంస్థ గోనె సంచుల్లో డ‌బ్బు నింపుకుని ఇన్‌కం ట్యాక్స్ వాళ్ల‌కు దొరక్కుండా ప్లాన్ చేస్కోవ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టే ఉంది క‌దూ?