ప్ర‌భాస్ చెప్పే గుడ్ న్యూస్ క‌న్ఫ‌మ్‌గా అదేనా?!

Friday, September 30th, 2016, 10:49:30 PM IST

baahubali
బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌కి సంబంధించి మొట్ట‌మొద‌టి ప్రెస్‌మీట్ కొద్దిసేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్‌లో జ‌రిగింది. అక్టోబ‌రు మాసంలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలో బాహుబ‌లి సంద‌డి చేయ‌బోతున్నాడని రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని అక్టోబ‌రు 22న ఫ‌స్ట్‌లుక్‌తో పాటు, వ‌ర్చువ‌ల్ రియాలిటీలో మేకింగ్ వీడియోని కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. అయితే ఈ నెల 5వ తేదీన ప్ర‌భాస్‌కి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించ‌నున్న‌ట్టు రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు. ఆ న్యూస్ ఏంట‌ని మీడియా గుచ్చి గుచ్చి అడిగినా అటు రాజ‌మౌళి కానీ, ఇటు ప్ర‌భాస్ కానీ ఆ వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేదు. దీంతో
అప్ప‌ట్నుంచి బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపిన‌ట్టు అన్న‌ట్టుగా మ‌రో ప్ర‌శ్న త‌లెత్తింది. అయితే మీడియా వ‌ర్గాలు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆ న్యూస్ గురించి ఓ విష‌యాన్ని మాట్లాడుకొంటున్నాయి. సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మొత్తం గ‌ర్వ‌ప‌డేలా ఆ న్యూస్ ఉంటుంద‌ని, అస‌లు మేమే ఊహించ‌లేద‌ని రాజ‌మౌళి చెబుతున్న‌దాన్నిబ‌ట్టి ప్ర‌భాస్‌కి హాలీవుడ్ నుంచి కానీ, లేదంటే బాలీవుడ్ నుంచి కానీ పిలుపు వ‌చ్చుండొచ్చ‌ని, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆయ‌న భాగ‌మ‌య్యుండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారంతా. బ‌హుశా నిజం కూడా అదే అయ్యుండొచ్చు.