బాహుబలి 2 ట్రైలర్ విడుదల కి అడ్డం పడుతోంది ఎవరు ?

Sunday, February 26th, 2017, 11:25:43 AM IST


బాహుబలి రెండవ భాగం కోసం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారత దేశం మొత్తం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా విడుదల కి కేవలం రెండంటే రెండే నెలలే టైం ఉంది. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ లూ అడపా దడపా పోస్టర్ లు వస్తున్నాయి కానీ ఎక్కడా సినిమాకి సంబందించి టీజర్ కానీ ట్రైలర్ కానీ పాట కానీ రాలేదు. మరి ఈ విషయం రాజమౌళి దగ్గర అడిగితే ట్రైలర్ గురించి ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ‘‘బాహుబలి-2 ట్రైలర్ రెడీ అయింది. మా వరకు షాట్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాం. ఇక దానికి విజువల్ ఎఫెక్ట్స్.. సీజీ హంగులు జోడించాల్సి ఉంది. ట్రైలర్ ఎప్పుడొస్తుందో కరెక్ట్ డేట్ చెప్పడంలో మాకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మేం ఇప్పుడు డేట్ ప్రకటించామంటే వీఎఫెక్స్ స్టూడియో వాళ్లు సరిగ్గా ఆ తేదీకే కంటెంట్ ఇస్తారు. కొంచెం రిలాక్స్ అవుతారు. మాకు ఇబ్బందవుతుంది. ఆ కంటెంట్ మా చేతికి వచ్చాక వాటిని మిక్స్ చేయడం.. ట్రైలర్ సరిగ్గా వచ్చేలా చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ముందే డేట్ చెప్పేసి.. వీఎఫెక్స్ కంటెంట్ వచ్చాక దాన్ని మిక్స్ చేయడంలో ఆలస్యమై.. చెప్పిన సమయానికి ట్రైలర్ రాకుంటే జనాలు గోల పెట్టేస్తారు. అందుకే డేట్ చెప్పట్లేదు. ఆ కంటెంట్ కోసం వాళ్లను తొందరపెడుతున్నాం. వాళ్లు అదివ్వగానే అన్నీ చూసుకుని డేట్ ప్రకటించి.. ట్రైలర్ లాంచ్ చేస్తాం. ఏదేమైనా మార్చి మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేయాలన్నది మా ప్లాన్’’ అని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.