నయారాయపూర్ పై బాబు కన్ను

Tuesday, September 23rd, 2014, 12:28:37 AM IST

babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఛత్తీస్ గడ్ లో పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సహకరించాలని ఆయన ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను కోరారు. అనంతరం చంద్రబాబు నాయుడు, నయా రాయపూర్ లో జరిగిన అభివృద్ది గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నయా రాయపూర్ నిర్మాణం అద్బుతంగా ఉందని చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. నయా రాయపూర్ ప్రణాళికలపై ఛత్తీస్ గడ్ ప్రభుత్వం తమకు ప్రజెంటేషన్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఛత్తీస్ గడ్ వ్యాపారవేత్తలను చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.