దారుణం : ట్యాబ్లేట్లు వికటించి మృతిచెందిన చిన్నారి…

Monday, February 10th, 2020, 06:50:53 PM IST

సోమవారం నాడు జగిత్యాలలో ఒక దారుణం జరిగింది. నేడు ఉదయం అంగన్ వాడి కేంద్రంలో పిల్లలందరికీ నులిపురుగులు నివారణకు మాత్రలు వేశారు. కానీ ఆ మాత్రలు వికటించి ఒక 8 సంవత్సరాల విద్యార్థిని మరణించింది. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లా, ధర్మపురిలో జరిగింది. అయితే సోమవారం నాడు నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు అందించిన మాత్రలు వేసుకున్న 8 ఏళ్ళ విద్యార్థిని సహస్ర, కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమెని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని వెల్లడించారు.

అంతేకాకుండా మరికొంత మంది విద్యార్థులు కూడా తీవ్రమైన అస్వస్థతకి గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటే మడకశిర మండలం మల్లినాయకపల్లిలో ఆరుగురు విద్యార్థులు కూడా ఈ మాత్రల కారణంగా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. తాడిపత్రిలో మరొక 20 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ నులిపురుగులు మాత్రల కారణంగా తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.