నోటా విషయంలో విజయ్ కు ఎదురు గాలి ?

Saturday, October 6th, 2018, 02:47:58 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరో అర్జున్ రెడ్డి .. అలియాస్ విజయ్ దేవరకొండ కు ఇప్పుడు ఎదురుగాలి మొదలైంది. ప్రస్తుతం అయన నటించిన నోటా సినిమా నిన్న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయినా ఈ సినిమా తమిళంలో యావరేజ్ టాక్ ని అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఫ్లాప్ టాక్ నే మూటగట్టుకుంది. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ న క్రియేట్ చేశారు .. తీరా సినిమా విడుదల అయ్యాక ఆ అంచనాలను అందుకోలేదు . ముక్యంగా ఈ సినిమాకు నోటా అనే టైటిల్ ఎందుకు పెట్టారని జనాలు అడుగుతున్నారు. నోటా అంటే నేను ఎవరికీ ఓటు వేయను అని చెప్పినట్టు .. కానీ అలాంటిది ఈ సినిమాలో ఎక్కడ లేదు. పైగా కథలో విషయం లేకపోవడం .. హీరోయిజం ఎలివేట్ కాకపోవడం లాంటి చాలా అంశాలు ఈ సినిమాను నిరాశ పరచాయి. గత మూడేళ్ళుగా విజయ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది .. లేటెస్ట్ గా గీత గోవిందం సినిమాతో వందకోట్ల హీరోగా మారిన విజయ్ కి ఎదురుగాలి తగిలింది.