బాహుబ‌లి- 2 చైనా రిలీజ్ కోసం నానా తంటాలు!

Friday, February 9th, 2018, 11:56:04 PM IST

ఇండియాలోనే నంబ‌ర్ -1 క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమా బాహుబ‌లి-2. వ‌ర‌ల్డ్ వైడ్ నంబ‌ర్ -2 స్థానంలో ఉంది. ఇండియాలో దంగ‌ల్ నంబ‌ర్ -2 స్థానంలో ఉన్నా, వ‌ర‌ల్డ్ వైడ్ మాత్రం నంబ‌ర్ -1 స్థానంలో ఉంది. ఇక చైనాలో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన దంగ‌ల్ అక్క‌డ ఏకంగా 1200 కోట్లు వ‌సూలు చేసింది. ఈ వ‌సూళ్లే దంగ‌ల్‌ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా నంబ‌ర్ -1 ఇండియ‌న్ సినిమాగా నిల‌బెట్టాయి.

అయితే తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఆ రికార్డును చెరిపేసేందుకు బాహుబ‌లి -2 స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లు చైనాలో ఈ సినిమా రిలీజ‌వ్వ‌ద‌ని ప్ర‌చారం సాగింది. కానీ అక్క‌డా రిలీజ్‌కి ఆర్కా మీడియా శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. అయితే చైనా రిలీజ్ అంత వీజీ కాదు. అక్క‌డ ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తులు రావ‌డం చాలా కష్టం. చాలా ప‌రిమితంగా మాత్ర‌మే విదేశీ సినిమాల రిలీజ్‌ల‌కు అక్క‌డ ఓకే చెబుతారు. బాహుబ‌లి రిలీజ్ చేసిన ప్ర‌తిష్ఠాత్మ‌క చైనీ కంపెనీ ఈ-4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో ప్ర‌స్తుతం ఆర్కా సంస్థ చ‌ర్చ‌లు జ‌రుపుతోందిట‌. కాస్త క‌ష్ట‌మే అయినా.. ఈ4 సంస్థ సాయం చేస్తే రిలీజ్ సుల‌భ‌మే. ఏదో ఒక ర‌కంగా అక్క‌డా బాహుబ‌లి రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే, సింపుల్‌గా 2000 కోట్లు వ‌సూలు చేసేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే ఇక ఇండియాలో ఉన్న అన్ని రికార్డుల్ని బాహుబ‌లి-2 చెరిపేసిన‌ట్టే. మ‌రోసారి తెలుగోడి స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసొస్తుంది. బాహుబ‌లి-1 చైనా రిజ‌ల్ట్ ఆశించిన స్థాయిలో లేదు కాబ‌ట్టి కాస్త ఆగాలి. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.