బాహుబలి కి భయపడుతున్న అల్లూ అర్జున్

Friday, February 10th, 2017, 11:42:47 AM IST


తెలుగు ప్రేక్షకులేంటి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న చిత్రం బాహుబలి 2 .. దీ కంక్లూజన్ అంటూ రాజమౌళి పట్టుకోస్తున్న ఈ సినిమా కోసం సర్వత్రా ఉత్కంట గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కి కౌంట్ డౌన్ అప్పుడే మొదలు అయిపొయింది. ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందరకి ప్రపంచ వ్యాప్తంగా తీసుకుని రాబోతున్నాడు రాజమౌళి. ఈ నేపధ్యం లో వేసవి లో రావాల్సిన సినిమాలు అన్నీ వాయిదా పడేలా ఉన్నాయి. ‘కాటమరాయుడు’ను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నుంచి వాయిదా వేయకూడదని పట్టుదలతో ఉంది ఆ చిత్ర బృందం. గతంతో పోలిస్తే తెలుగు సినిమాలకు ఈ మధ్య రన్ కొంచెం పెరిగింది. మూడు.. నాలుగు వారాల్లో సైతం మంచి వసూళ్లే వస్తున్నాయి. కాబట్టి మార్చిలోనే సినిమాను రిలీజ్ చేస్తే పాజిటివ్ టాక్ ఉంటే.. ‘బాహుబలి’ ప్రభావం పడకుండా మూడు.. నాలుగు వారాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు. బాహుబలి తరవాత రావాల్సిన దువ్వాడ జగన్నాథం నిజానికి మే మూడవ వారం లో విడుదల చెయ్యాలి కానీ బాహుబలి మేనియా విపరీతంగా ఉంటే ఆ డేట్ మంచిది కానే కాదు. అందుకే ‘డీజే’ను మే అంతటా కూడా రిలీజ్ చేయకుండా ఆపేస్తే ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు మేలో రిలీజ్ పెట్టుకుంటే ‘బాహుబలి’ వాయిదా పడితే ఇబ్బంది కదా అని జూన్ నెలాఖరుకు వెళ్లిపోయిన మహేష్ సినిమా విషయంలో కొంచెం తర్జన భర్జనలు నడుస్తున్నాయి.