బాహుబలి- 2 అయినా అక్కడ సక్సెస్ అవుతుందా?..డౌటే?

Tuesday, September 26th, 2017, 09:57:57 AM IST


బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని సైతం కదిలించిన బాహుబలి చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందించింధో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విదేశాల్లో కూడా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. దీంతో చైనా మార్కెట్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. అసలైతే సినిమాను అక్కడ ఎప్పుడో రిలీజ్ చెయ్యాలి కానీ అప్పుడు బాలీవుడ్ దంగల్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

దీంతో ప్రయోగం ఎందుకులే అని బాహుబలి నిర్మాతలు లైట్ తీసుకున్నారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే అదే నెలలో కొన్ని భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో బాహుబలి 2 వాటితో పోటీ పడుతుందా అనేది కాస్త సందేహంగానే ఉంది. అయితే బాహుబలి మొదటి పార్ట్ అక్కడ అంతగా ఏడలేదు మరి సెకండ్ పార్ట్ ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments