`దంగ‌ల్‌`కి కూత వేటు దూరంలో?

Sunday, May 13th, 2018, 03:00:31 AM IST


భారీ అంచ‌నాల న‌డుమ దాదాపు 7000 స్క్రీన్ల‌లో చైనా వ్యాప్తంగా రిలీజైంది బాహుబ‌లి-2. అయితే ఈ సినిమా చైనాలో స‌క్సెసైందా? అంటే పెద‌వి విరిచేస్తున్నారు ట్రేడ్ పండితులు. చైనాలో బాహుబ‌లి -2 ఆశించిన ఫ‌లితాన్ని ద‌క్కించుకోలేక‌పోయింద‌ని చెబుతున్నారు. ఓవైపు 10 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌(70కోట్లు)లో చేరినా.. 100 కోట్ల క్ల‌బ్‌లో అయినా చేర‌లేక‌పోయింద‌న్న నిరాశ త‌ప్ప‌లేదు. సినిమాకి భారీగా ఖ‌ర్చు చేసి చైనీ అనువాదం చేశారు. అలానే ప్ర‌చారం కోసం భారీగా ఖ‌ర్చు చేశారు. అయితే అదంతా వెన‌క్కి వ‌చ్చిందా.. లేదా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉందింకా.

ఇక చైనాలో స‌క్సెస్ సాధిస్తే అమీర్‌ఖాన్ `దంగ‌ల్‌` రికార్డును కొట్టేసే ఛాన్సుంద‌ని అంతా భావించారు. చైనా వ‌సూళ్లు క‌లుపుకుని `దంగ‌ల్‌` దాదాపు 1950 కోట్లు వ‌సూలు చేసింది. `బాహుబ‌లి` చైనాలో సాధించిన 70 కోట్లు క‌లుపుకుంటే 1720 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింది. అంటే ఇంకా దాదాపు 200 కోట్ల మేర వెన‌క‌బ‌డింది. అంటే ఇక `దంగ‌ల్` రికార్డును బాహుబ‌లి -2 కొట్టేసే ఛాన్స్ లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అయితే దీనిపై ప‌క్కా క్లారిటీతో ఆర్కా మీడియా ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తుందేమో చూడాలి. మొత్తానికి దంగ‌ల్ రికార్డును చేరువ‌య్యే ఛాన్స్ ఉన్నా..కూత వేటు దూరంలో మిస్స‌యింది అంతే!