బాహుబలి2 ని లీక్ చేసిన కేటుగాడిని పట్టేశారు ..!

Wednesday, November 23rd, 2016, 03:00:43 AM IST

baahubali2
రాజమౌళి మరియు అతని బృందం ప్రాణం పెట్టిమరీ భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న బాహుబలి 2 చిత్రానికి సంభందించిన 9 నిమిషాల వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే అయితే ఆ వీడియోని లీక్ చేసింది ఎవరో కాదు. ఆ చిత్రానికి గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్న కృష్ణ.వీడియో లీక్ అయినవెంటనే చిత్ర నిర్మాత పోలీస్ లకు ఫోర్యాదు చేసారు. దీనితో వెంటనే స్పందించిన సైబర్ క్రైమ్ విభాగం పోలీస్ లు విచారణ చేపట్టగా కృష్ణ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది.

ఈ చిత్రానికి గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్న కృష్ణ వీడియో లీక్ చేసి విజయవాడ లోని తన 25 మంది స్నేహితులకు చేరవేసాడు. దీనితో వెంటనే ఈ వీడియో నెట్ లో ప్రత్యక్షం అయింది.దీనితో కృష్ణ అనే వ్యక్తిని విజయవాడ లోనే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా బాహుబలి మొదటి భాగం దేశం లోనే సంచలన విజయం సాధించడంతో రెండవ భాగం పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క మొదలగు వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28, 2017 న విడుదల కానుంది.