వైరల్ వీడియో : బాహుబలిలో అది కాపీనా..?

Tuesday, January 30th, 2018, 09:35:37 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం కాపీ అని వినిపిస్తోన్న విమర్శ బాహుబలికి కూడా అంటుకుంది. అయితే ప్రేరణ గా తీసుకున్నారని కొందరు అంటుంటే కాదు కాపీ కొట్టారు అని మరికొందరు ఆరోపిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే బాహుబలి-1 ఫస్ట్ హాఫ్ ఎండ్ లో వచ్చే ఒక సన్నివేశంలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ అని తేలింది. అంతే కాకుండా అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1949లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన కీలుగుఱ్ఱం అనే సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాహుబలి లో వాడారు అనిపిస్తోంది. కీరవాణి ఎక్కువగా కాపీ కొట్టడు అనేది అందరికి తెలిసిందే. సంగీత పరంగా తెలుగు సాహిత్యాన్ని అందించడంలో ఆయన తరువాతే ఎవరైనా. ఇక మ్యూజిక్ ని ప్రేరణగా తీసుకొని లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ట్యూన్ చేయడం ప్రశంసించ దగ్గ విషయమని మరికొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.