`బాహుబ‌లి` రికార్డులకు `మ‌గ‌ధీర` బ్రేక్!

Wednesday, September 5th, 2018, 11:09:45 PM IST

రంగ‌స్థ‌లం చిట్టిబాబు రేంజు పెరిగిందా? విదేశీ రికార్డుల్లో రామ్‌చ‌ర‌ణ్ స‌త్తా చాటుతున్నారా? అంటే అవున‌నే జ‌పాన్ నుంచి రిపోర్ట్ అందింది. అయితే రంగ‌స్థ‌లం చిత్రాన్ని రిలీజ్ చేయ‌లేదు కానీ, మ‌గ‌ధీర రికార్డులు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాయి. `మ‌గ‌ధీర` స్టామినా ప్ర‌భాస్‌ని మించిపోతోంద‌ని, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `ముత్తు` రికార్డుల్ని ఈ సినిమా బ్రేక్ చేయ‌నుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. జ‌ప‌నీ రికార్డుల్ని మ‌గ‌ధీర వేటాడుతోంద‌ని ట్రేడ్ వెల్ల‌డించింది.

ఇన్నాళ్లు జ‌పాన్‌లో ర‌జ‌నీకాంత్, ప్ర‌భాస్ అంటూ చెప్పుకున్న అభిమానులు ఇక‌పై రామ్‌చ‌ర‌ణ్ పేరును ప్ర‌ముఖంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. గ్లోబ‌ల్ మార్కెట్లోకి తెలుగు సినిమా దూసుకుపోతున్న వేళ జ‌ప‌నీల్లోనూ మ‌న సినిమాల‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. బాహుబ‌లి ఇమేజ్‌తో బాహుబ‌లి ప్ర‌భాస్ స్నేహితుడు రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన `మ‌గ‌ధీర‌`ను జ‌పాన్‌లో రిలీజ్ చేశారు. ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రానికి జ‌ప‌నీలో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రిలీజైన తొలి వారంలోనే 1 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చేరింది. అంటే 6కోట్లు వ‌సూలు చేసింది. జ‌పాన్‌లో ప్ర‌భాస్ బాహుబ‌లి -1.2 మిలియ‌న్ డాల‌ర్లు, ర‌జ‌నీకాంత్ ముత్తు -1.6 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేశాయి. ఇప్పుడు ఆ రికార్డుల్ని మ‌గ‌ధీర ఫుల్ ర‌న్‌లో వేటాడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి ఆరంభం అదిరింది. ఇక చ‌ర‌ణ్ న‌టించే సినిమాల్ని, చ‌ర‌ణ్ నిర్మిస్తున్న సైరా చిత్రాన్ని జ‌పాన్‌లో ఎన్‌క్యాష్ చేస్కోవ‌చ్చ‌న్న‌మాట‌!!

  •  
  •  
  •  
  •  

Comments