సడన్ గా బాహుబలి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు ?

Friday, September 30th, 2016, 02:58:39 PM IST

bahubali
తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ”బాహుబలి” చిత్రానికి సీక్వెల్ గా ది కంక్లూషన్ పేరుతొ ”బాహుబలి 2” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా యూనిట్ ఈ రోజు అకస్మాత్తుగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చాంశంనీయంగా మారింది? అవును ఇంత సడన్ గా ‘బాహుబలి’ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు అనేది తెలియరావడం లేదు. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రెస్ మీట్ లో ఎం మాట్లాడతారు, అయితే యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం ఈ రోజు ఈ సినిమా షూటింగ్ పూర్తీ అయిన విషయం గురించి, ఎప్పుడు విడుదల చేసే విషయం పై మాట్లాడతారని అంటున్నారు. ఇప్పటికే విడుదల డేట్ కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. మరి ఈ రోజు ఏ విషయం పై వాళ్ళు మాట్లాడతారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది మరి ?

  •  
  •  
  •  
  •  

Comments