ట్రెండింగ్ : సూర్య ఫంక్షన్ కి బాహుబలి?

Wednesday, April 11th, 2018, 03:20:05 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేసేవారు. అయితే ఆ తరువాత ఆ సంప్రదాయం చాలా సంవత్సరాలు కొనసాగలేదు. మళ్లి ఆ సంస్కృతిని సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో కలిసినటించి కొనసాగించారు. అలానే ఒక స్టార్ హీరో సినిమా వేడుక‌కు మ‌రో స్టార్ హీరో రావ‌డ‌మ‌నేది తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా అరుదు. కానీ, ఇటీవ‌ల దాన్ని కూడా మ‌హేష్ బాబే బ్రేక్ దాన్ని చేశాడు.

త‌న సినిమా `భ‌ర‌త్ అనే నేను` ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్‌కు ఎన్టీఆర్ ను ఆహ్వానించి అంద‌రికీ షాకిచ్చాడు.అయితే అదే బాటలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే రూట్‌ను ఫాలో కాబోతున్న‌ట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ న‌టించిన లేటెస్ట్ సినిమా `నా పేరు సూర్య‌` ప్రీ-రిలీజ్ ఈవెంట్ త్వ‌ర‌లో జ‌రుగ‌బోతోంది. ఈ వేడుక‌కు ఓ స్టార్ హీరోను ఆహ్వానించినట్టు స‌మాచారం. ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు,`బాహుబ‌లి`తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్‌. ఈ నెల‌లోనే జ‌రుగ‌నున్న `నా పేరు సూర్య‌` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ రాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌భాస్‌, బ‌న్నీ మంచి స్నేహితుల‌నే విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే బ‌న్నీ ఆహ్వానానికి ప్ర‌భాస్ సానుకూలంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ విషయమై యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది…….

  •  
  •  
  •  
  •  

Comments