మరో బాహుబలి రాబోతోంది.. అంతా కొత్తవారే: బాహుబలి నిర్మాత

Sunday, May 6th, 2018, 12:52:48 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి రీసెంట్ గా చైనాలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోవడం చూస్తుంటే సినిమా మరో రికార్డ్ ను అతి త్వరలోనే క్రియేట్ చేస్తుందనే టాక్ వస్తోంది. ఇకపోతే చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. సినిమా కథను ఆధారంగా చేసుకొని వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. హిందీ ఇంగ్లిష్ లో నిర్మించబోయే ఆ ఫ్రీక్వెల్ లో పూర్తిగా కొత్త నటీనటులు ఉంటారట.

శివగామి చిన్నతనం నుంచి అలాగే మాహిష్మతీ రాజ్యంలో ఎలా అడుగుపెట్టింది అనే అంశం తో పాటు నుంచి రాజ్యం విస్తరించిన తీరుని ఫ్రీక్వెల్ లో చూపించనున్నారు. ఆగస్టు లో బాహుబలి కోసం వేసిన సెట్స్ లలో చిత్రీకరణను మొదలు పెట్టనున్నారు. అవసరమైతే మరికొన్ని సెట్స్ ను కూడా నిర్మిస్తామని నిర్మాత శోబు యార్లగడ్డ వివరించారు. రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ సివగామి’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ నడవ వచ్చానే కామెంట్స్ వస్తున్నాయి. కట్టప్ప అసలు కథ కూడా ఇందులో ఉంటుందట. అతను ఎక్కడి నుంచి వచ్చాడు. ఎలా బానిసయ్యాడు వంటి అంశాలను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.