సల్మాన్ బెయిల్ పై నిర్ణయం నేడే ?

Saturday, April 7th, 2018, 10:31:49 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తు కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో తన శిక్షను నిలుపుదల చేస్తూ బెయిల్ మంజూరు చేయాలనీ సల్మాన్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం వాదనలు విని, విచారణలో ఎన్నో లోపాలు ఉన్నాయని, ఈ కేసులో సల్మాన్ ఆయుధాలు ఉపయోగించినట్టు ఎక్కడ అధరాలు లేవని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను విశ్వసించలేమని చెబుతూ, వేటకు సంబందించిన మిగతా కేసుల్లో సల్మాన్ పై అభియోగాలేవి రుజువు కాలేదని న్యాయస్థానానికి గుర్తు చేసారు. అయితే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపాడు. అయితే సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ కు సంబందించిన నిర్ణయం ఈ రోజు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరి సల్మాన్ కు బెయిల్ ఇస్తారా .. లేక మరికొన్ని రోజులు పొడిగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments