ప్రేమికులు కనిపిస్తే పెళ్ళిళ్ళు చేయమంటున్న భజరంగ్‌దళ్.. కానీ..!

Saturday, February 8th, 2020, 09:44:53 PM IST

‘వాలెంటైన్స్ డే’ ప్రేమికులకు ఇదొక పండగ రోజు అనే చెప్పాలి. అయితే వాలంటైన్స్ డే రోజు అలా సరదాగా పార్క్‌కో లేక గుడికో, సినిమాకో వెళ్ళాలని తమ ప్రేయసికి, ప్రియుడికి ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని చాలా మంది ప్రేమికులు అనుకుంటారు. అయితే వాలెంటైన్స్ డే రోజు భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆ రోజు బయట కనిపించే ప్రేమికులకు అక్కడే పెళ్ళిల్ళు జరిపించేస్తారనేది తెలిసిందే.

అయితే వీరికి భయపడి గత కొన్నేళ్ళుగా వాలంటైన్స్ డే నాడు ప్రేమికులు కలుసుకోవడం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే సేవ్ భారత్ కల్చర్, బ్యాన్ వాలంటైన్స్ డే అంటూ భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ వాలంటైన్స్ డేకి వ్యతిరేకంగా ఒక పోస్టర్‌ని విడుదల చేసింది. వాలంటైన్స్ డే నాడు పార్కుల దగ్గర, పబ్‌ల దగ్గర కనిపించే ప్రేమికులకు ఇక నుంచి పెళ్ళిళ్ళు చేయమని అమరవీరుల ప్లెక్సీలకు నివాళులు అర్పించేలా చేస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే అన్ని పార్కులకు, పబ్‌లకు ఈ లేఖలు పంపినట్టు జరంగ్‌దళ్, వీహెచ్‌పీ ప్రకటించింది. అయితే వీరి ప్రయత్నం కాస్తైనా ఫలించి ప్రేమికులు వాలంటైన్స్ డేకి దూరంగా ఉంటారా లేదా పెళ్ళిళ్ళు చేయరని తెలిసి ప్రేమికులు కలుసుకునే సంఖ్య మరింత పెరుగుతుందా అనేది చూడాలి మరీ.