చైనా బాక్సాఫీస్‌పై భాయిజాన్ దండ‌యాత్ర‌?

Thursday, February 22nd, 2018, 09:09:40 PM IST


బాలీవుడ్ సినిమాలు దంగ‌ల్, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ చైనా మార్కెట్లో అత్యంత భారీగా రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. ఇండియా వ‌సూళ్ల కంటే రెట్టింపు లాభాల్ని చైనానుంచి తెచ్చాయి. ఇది మ‌న నిర్మాత‌ల్ని ఆలోచింప‌జేస్తోంది. చైనా మార్కెట్‌కి త‌గ్గ క‌థాంశాల్ని ఎంచుకుని, చైనా-ఇండియా స‌హా గ్లోబ‌ల్ మార్కెట్లో రిలీజ్ చేస్తే ఇక సినిమాల వ‌సూళ్ల‌కు తిరుగుండ‌ద‌ని భావిస్తున్నారంతా. చైనాలో ఓ ఇండియ‌న్ సినిమా రిలీజ‌వ్వ‌డం ఒకెత్తు అయితే 1000 కోట్లు పైగా ఆదాయం తేవ‌డం అంటే అది అసాధార‌ణ‌మైన విజ‌యం కిందే లెక్క‌.

అందుకే చైనా ఎన్‌ల‌పై బాలీవుడ్ భాయిజాన్ స‌ల్మాన్ ఖాన్ క‌న్నేశాడు. అత‌డు న‌టించిన బంప‌ర్ హిట్ చిత్రం `భ‌జ‌రంగి భాయిజాన్‌`ను భారీ రేంజులో చైనాలో రిలీజ్ చేస్తున్నాడు. అక్క‌డ పెద్ద నిర్మాణ సంస్థ అండ‌దండ‌ల‌తో స‌ల్మాన్ త‌న సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. మార్చి 1న భ‌జ‌రంగి భాయిజాన్ అత్యంత భారీగా చైనాలో రిలీజ‌వుతోంది. దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ చిత్రాల్ని మించి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. మార్చి 2న చైనాలో భ‌జ‌రంగి భాయిజాన్ రిలీజ్ కానుంది. అయితే థియేట‌ర్ల ప‌రంగా రికార్డుల మాటేమో గానీ, క‌లెక్ష‌న్ల‌లో దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ రికార్డుల్ని భాయిజాన్ ట‌చ్ చేస్తాడా?అన‌్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. జ‌స్ట్ వెయిట్ అండ్ వాచ్‌.