బరిలోకి దిగుతున్న బాల్ థాకరే వారసుడు

Friday, July 19th, 2019, 02:14:51 PM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దండుడు దివంగత బాల్ థాకరే. ఈయన కుటుంబానికి మహారాష్ట్ర ప్రజలు ఎప్పుడూ పెద్ద పీఠ వేస్తూనే ఉంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించాలన్నా వీరి మద్దతు తప్పనిసరి. బాల్ థాకరే తర్వాత ఆయన వారసుడిగా ఉద్దవ్ థాకరే రాజకీయాల్లో ఉండగా ఇప్పుడు ఆయన కుమారుడు ఆదిత్య థాకరే రాజకీయ ఆరంగేట్రానికి రెడీ అయ్యారు.

శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, యువజన నాయకుడు ఆదిత్య ఠాక్రే ఇవాళ ప్రజా యాత్రను ఇవాళ ప్రారంభించారు. జల్గావ్‌ నుంచి ‘జన ఆశీర్వాద యాత్ర’ పేరుతో ఈ యాత్రను ప్రారంభించారాయన. సుమారు 4000 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది.

ఈ యాత్ర త్వరలో సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికల కోసమేనని తెలుస్తున్నా శివసేన వర్గాలు మాత్రం ఓట్ల కోసం కాదని మహారాష్ట్ర నవనిర్మాణం కోసమని, పార్టీని ప్రతి ఇంటికి చేర్చడం కోసమేనని అంటున్నాయి.