తెలుగువాడి సత్తా చూపమన్న బాలయ్య

Saturday, September 13th, 2014, 05:34:21 PM IST


హిందూపూర్ నగరంలోని సప్తగిరి కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు,తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని, తెలుగువారి గొప్పతనాన్ని దేశవిదేశాలలో చాటాలని పిలుపునిచ్చారు.

బాలయ్య ఇంకా మాట్లాడుతూ సమాజంలో మహిళకు ప్రాధాన్యతనిచ్చి రాజకీయాలలోకి తీసుకువచ్చింది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని తెలిపారు. తామందరం ఎన్టీఆర్ ఆదర్శాలు, ఆశయాలతోనే ముందుకు వెళుతున్నామని బాలకృష్ణ వివరించారు. ఇక కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో యువశక్తి కీలకమని, విద్యార్ధులు లక్ష్యాలను ఏర్పరుచుకుని ముందుకు వెళ్లాలని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, మున్సిపల్ చైర్ పర్శన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.