మెరుగుపడుతున్న బాలచందర్ ఆరోగ్యం

Thursday, December 18th, 2014, 12:51:23 PM IST

Balachander
ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అనారోగ్యంతో బాధపడుతూ గత ఆదివారం నుండి ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా వారిని వైద్యులు ఐసీయూలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారని, బుధవారం ఆరోగ్యం కొంత మెరుగు పడిందని, ఆందోళన అవసరం లేదని వైద్యాధికారులు ప్రకటించారు. కాగా బుధవారం కోలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులు వారిని పరామర్శించారు.