మెగా హీరోతో బాలయ్య.. రేపు ఒకే ఫ్రెమ్ లో !

Saturday, January 27th, 2018, 12:02:03 AM IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత కొంత కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని వివి.వినాయక్ తో ఇంటిలిజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్ ని హై లెవెల్ కి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ డిఫెరెంట్ గా ప్లాన్ చేసింది. అందుకు మెగా హీరో కోసం నందమూరి హీరోని రంగంలోకి దింపాడు వినాయక్. బాలకృష్ణ చేతుల మీదుగా రేపు కరెక్ట్ మూడు గంటల 23 నిమిషాలకు టీజర్ ని రిలీజ్ చేస్తారట. బాలకృష్ణ రీసెంట్ గా జై సింహాతో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాకు అడుగగానే వస్తానని బాలయ్య చెప్పారట. దీంతో మరోసారి మెగా హీరో – నందమూరి హీరోను ఒకే ఫ్రెమ్ లో చూడవచ్చు. ఇక ఇంటిలిజెంట్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.