ఎన్టీఆర్ సినిమాను నేను నిర్మిస్తానంటున్నాడు !!

Wednesday, February 8th, 2017, 06:39:18 PM IST


మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథ తెరపైకి రావడానికి రంగం సిద్ధం అవుతుంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నాన్నగారి జీవిత కథతో సినిమా చేస్తానని చెప్పిన తరువాత ఈ సినిమా పై అందరి ఫోకస్ ఎక్కువైంది. ఈ సినిమాను నేనే డైరెక్ట్ చేస్తానని బాలయ్య అంటున్నాడు .. మరో వైపు ఎన్టీఆర్ సినిమా బాలయ్యతో చెయ్యడానికి పూరి జగన్నాధ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని నేను నిర్మిస్తానని అంటున్నాడు ఓ యువ నిర్మాత ? ఇంతకీ అయన ఎవరో తెలుసా .. విష్ణు వర్ధన్. అప్పట్లో హైద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో సినిమా స్టార్స్ తో సిసిఎల్ క్రికెట్ కప్ ని నిర్వహించిన విష్ణు వర్ధన్? ప్రస్తుతం సైమా అవార్డు లను నిర్వహిస్తున్న విష్ణు నటుడు మురళి మోహన్ అల్లుడు కూడా !! విబ్రి మీడియా బ్యానర్ తో ఈయన పలు ఈవెంట్స్ ని నిర్వహించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. సో త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.