ఫాన్స్ కోసం ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చిన బాలయ్య

Saturday, December 31st, 2016, 11:38:26 AM IST

balakrishna
గతం లో బాలకృష్ణ – ఎస్వీ కృష్ణా రెడ్డి ల దర్సకత్వం లో టాప్ హీరో అనే సినిమా వచ్చింది. టైటిల్ కి అచ్చం రివర్స్ లో భారీ ప్లాప్ ని మూటగట్టుకుంది ఈ సినిమా. చాలా మంది స్టార్ లతో ఎస్వీ సినిమాలు చేసారు. కృష్ణ తో నెంబర్ 1 లాంటి సూపర్ హిట్ కమర్షియల్ సినిమా తీసిన ఎస్వీ ఆ తరవాతి కాలం లో ఫేడ్ అవుట్ అయిపోయారు. ప్రస్తుతం యమలీల 2 అనే సినిమాతో మళ్ళీ కొత్త ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఊరుకున్నారు ఆయన. ఇప్పుడు బాలయ్య 101 వ సినిమాకి డైరెక్టర్ అవుదాం అనుకుని సూపర్ కథ తో బాలయ్య ని అప్రోచ్ అవ్వడం దానికి బాలయ్య కూడా కథ నచ్చింది అనడం తో ఆయన దశ తిరిగింది అని అనుకున్నారు. కట్ చేస్తే పరిస్థితి కాస్త డిఫరెంట్ గానే మారిపోయింది. బాలకృష్ణ ఈ కథ ని దాదాపుగా ఓకే చేసిన తరవాత తన ఫాన్స్ నుంచే ప్రెజర్ ని చూసి షాక్ అయ్యారు. ఎస్వీ తో సినిమా వద్దు గాక వద్దు అంటూ ఫాన్స్ సోషల్ మీడియా నుంచే బాలకృష్ణ కి మెసేజ్ లూ రిక్వస్ట్ లూ పెట్టడం మొదలు పెట్టారు. దీంతో బాలయ్య ఒక్కసారిగా ఇదేంటి అంటూ ఆరా తీసి ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా వరస్ట్ గా ఉంది అని సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణవంశీతో రైతు.. అలాగే పూరి జగన్ తో ఓ కథ.. మొదలగు సినిమాల టాక్ పైకితెచ్చినట్లే తెచ్చి మిడిల్ డ్రాప్ అయిన బాలయ్య.. ఇప్పుడు కృష్ణారెడ్డి విషయంలో కూడా అదే చేశారు. ఈ మధ్యన తండ్రి సినిమా కథలనూ ప్రాజెక్టులనూ చూస్తున్న కూతురు బ్రాహ్మణి కూడా ఈ ప్రాజెక్ట్ తో ముందుకెళ్లకపోవడమే మంచిది అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ సినిమాను బాలయ్య ఆపేశారనే అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు.

  •  
  •  
  •  
  •  

Comments