బాల‌య్య‌ ఫ్యామిలీ విజ‌య‌వాడ‌కు షిఫ్ట‌వుతోందా?

Wednesday, February 28th, 2018, 11:00:19 PM IST

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ కుటుంబం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ స‌మీపంలో, కేబీఆర్ పార్క్ ప‌రిస‌రాల్లో చాలాకాలంగా నివాసం ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ప‌క‌డ్భందీ సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్ మ‌ధ్య ఒక తోట లాంటి చోట విలాస‌వంత‌మైన భ‌వంతిలో బాల‌య్య ఫ్యామిలీ నివాసం ఉంటోంది. అయితే గ‌త కొంత‌కాలంగా ఈ నివాస స్థ‌లంలో భ‌వంతిని కూల్చివేసి, భారీ షాపింగ్ మాల్ నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

ప్ర‌స్తుతం ఏపీ నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలోనే నివాసం ఉంటున్నారు. ఆ క్ర‌మంలోనే బాల‌య్య కూడా విజ‌య‌వాడ‌కు షిఫ్ట‌య్యే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఆ మేర‌కు సామాజిక మాధ్య‌మాల్లో ఈ వార్త జోరుగా వైర‌ల్ అయిపోయింది. ఎలానూ హిందూపురం ఎమ్మెల్యేగా ఏపీలోనే త‌న సేవ‌లు అవ‌స‌రం అవుతాయి… కాబ‌ట్టి బాల‌య్య అక్క‌డికి షిఫ్ట‌వ్వ‌డ‌మే క‌రెక్టు అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ఎలానూ షాపింగ్ మాల్ నిర్మిస్తే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలి క‌దా! అన్న టాక్ కూడా న‌డుస్తోంది. అయితే ఇది నిజ‌మా? కాదా? అన్న‌ది బాల‌య్య కాంపౌండ్ చెప్పాల్సి ఉంటుంది ఇంకా.