బావ కుర్చీకే ఎసరు పెట్టే పనిచేస్తున్న బాలయ్య

Saturday, June 15th, 2019, 12:18:28 AM IST

తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో చావుదెబ్బ తిని, లబోదిబోమంటుంది. కార్యకర్తలు పూర్తిగా నిరాశలో కురుకొనిపోయి ఉన్నారు. వాళ్ళని మళ్ళి ఉత్తేజపరిచే స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు కనిపించటం లేదు. మరో పక్క MLA లు ఎప్పుడు వెళ్ళిపోతారో అనే భయం. ఇంకో పక్క దాదాపు కొన్ని వందల నామినేట్ పదవుల నుండి టీడీపీ నాయకులు బయటకు వస్తున్నా పరిస్థితి. వీటన్నిటి నడుమ పార్టీని కాపాడుకుంటూ, ముందుకి పోవటం చాలా కష్టమైన పని. అయితే సరిగ్గా ఇక్కడే బాలకృష్ణ తన తెలివి తేటలు చూపిస్తూ, పార్టీకి మేము ఉన్నామని. కార్యకర్తలకి తోడుగా ఉంటామనే భరోసా కలిగిస్తూ ముందుకి దూసుకొని వెళ్తున్నాడు.

ముందుగా హిందూపూర్ లో అక్కడి టీడీపీ నాయకులకి భరోసా ఇస్తూ, ప్రభుత్వం అధికారంలో లేకపోయినా సరే మీకు కావలసిన అన్ని పనులు నేను దగ్గర ఉండి చేపిస్తానని చెప్పి, వాళ్లలో దైర్యం నింపాడు. ఆ తర్వాత ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడు రోజులు ఉండి, వచ్చే పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చాడు. తాజాగా నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) చైర్మన్ పదవికి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రాజీనామా లేఖను ఇచ్చాడు. ఈ సమయంలో బాలకృష్ణ కోటంరెడ్డి కి ఫోన్ చేసి, అధికారం కోల్పోయామని బాధపడవల్సిన అవసరం లేదు. అన్నగా నీకు తోడుగా నేను ఉన్న, గతంలో మాదిరి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం అంటూ తనదైన శైలిలో నాలుగు డైలుగులు వదిలాడు బాలయ్య.

ఒక్కపుడు పార్టీ అధికారంలో ఉంటే ఎన్నడూ పార్టీ గురించి పట్టించుకోని బాలయ్య , ఇప్పుడు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీని కాపాడటం కోసం బాగానే కష్టపడుతున్నాడు. ప్రస్తుతం చుస్తే బావ పని అయిపొయింది. అల్లుడు ఏమో అసలు గెలవనే లేదు..ఇప్పుడు గట్టిగా పోరాడి పనిచేస్తే ఈసారి ఏకంగా “పెద్ద” పదవే రావచ్చని బాలయ్య ఆలోచిస్తూ ఇలా చేస్తున్నాడేమో అంటూ పార్టీలోని కొందరు మాట్లాడుకోవటం విశేషం ..