బిజినెస్ లో దుమ్మురేపుతున్న బాలయ్య శాతకర్ణి !

Thursday, September 29th, 2016, 12:07:37 PM IST

BALAYYA
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో సినిమా ”గౌతమి పుత్ర శాతకర్ణి” షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తీ అయిన ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో మాత్రం సంచలనం రేపుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియ నటిస్తుంది. ఇక తల్లి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటీమణి హేమ మాలిని నటిస్తుంది. అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా సీడెడ్ హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి భారీ రేటుకు దక్కించుకున్నాడట !! ఈ ఏరియా కు గాను అయన ఏకంగా 9 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక నైజాం హక్కులకు భారీ పోటీ జరుగుతుందట ఇప్పటికే 18 కోట్లకు పలుకుతుందని తెలిసింది !! ఇక ఆంధ్రాలో కూడా భారీ క్రేజ్ నెలకొన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య కెరీర్ లో ఇది భారీ బిజినెస్ అని చెప్పాలి !! సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న ఈ సినిమాకు దాదాపు 80 కోట్ల వరకు బిజినెస్ జరగొచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం !!

Comments