నాకసలు కోపం రాదు .. అందరూ అపార్ధం చేసుకుంటున్నారు

Thursday, January 19th, 2017, 01:35:03 PM IST

balakrishna
గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా తాను అనుకున్న దానికంటే విపరీతంగా హిట్ అవడం తో బాలయ్య కి పండగ లా ఉంది . ప్రమోషన్ ల మీద ప్రమోషన్ లు ఇస్తూ ఇరగాదీస్తున్నారు బాలకృష్ణ. తనదైన కలక్షన్ లని సృష్టిస్తూ తన రికార్డులు తానే తిరగ రాస్తున్నారు ఆయన. ప్రమోషన్ లలో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో తన కోపం గురించి మాట్లాడుతూ ” చాలా మంది నాకు కోపం ఎక్కువ అనుకుంటారు కానీ అది అసలు నిజం కాదు . నేను చాలా త్వరగా కలిసి పోతాను అందరితో సరదాగా ఉండడమే నాకు అలవాటైన విషయం ” అన్నారు బాలయ్య. ఇదే సందర్భంలో నిత్యం తన సినిమాలపై నేరుగా కామెంట్ చేస్తూ ఆ సినిమాలోని ప్లస్సులూ – మైనస్సుల గురించి నిర్మొహమాటంగా చెప్పే తన కుటుంబ సభ్యులంతా.. “గౌతమీపుత్ర శాతకర్ణిలో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు” అని చెప్పడం తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు బాలయ్య. ఇదే సమయంలో ఒకపక్క ఎమ్మెల్యేగా మరోపక్క సినీ నటుడిగా మరో పక్క కేన్సర్ ఆస్పత్రి యాజమాన్య బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉన్నానని తెలిపారు.